BREAKING NEWS

Janasena Banner Image

Breaking News

మరోసారి తన మానవత్వలేమిని చాటుకున్న టీడీపీ

మరోసారి తన మానవత్వలేమిని చాటుకున్న టీడీపీ

Saturday, 17th Nov 2018

దివ్యాంగులను ప్రత్యేక శ్రద్ధతో చూడాలని మానవ సమాజానికి ప్రత్యేకించి చెప్పనవసరంలేదు. కాని మానవత్వం పూర్తిగా నశించి, సహృదయులే లేని టీడీపీకి ఈ విషయం అస్పష్టమని అర్ధమవుతోంది. ఇటీవలే జరిగిన ఒక ఉదంతం ఇందుకు ఉదాహరణగా నిలిచిందని చెప్పొచ్చు.

తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమించి పెళ్లిచేసుకున్న దివ్యాంగులు సంతోష్ మరియు పూజ, ఆర్ధిక సహాయం కోసం చంద్రన్న పథకాన్ని ఆశ్రయించాలని భావించారు. ఈనేపథ్యంలోనే అధికారులను సంప్రదించగా వారికి విముఖతే ఎదురైంది. దీనితో వారు సచివాలయంకు వెళ్లి చంద్రబాబు సహాయాన్ని అర్ధించాలని భావించగా అక్కడ కూడా తిరస్కరణకు గురై తీవ్ర మనోవేదనకు గురయ్యారు. దీనితో వారు జనసేన నేతలను సంప్రదించగా వారు పవన్ కళ్యాణ్ని కలిపించి ఆర్ధిక సహాయం అందేలా చేస్తామని మాటిచ్చినట్లు సమాచారం.

అనంతపురంలో జనసేన కరపాత్రల పంపిణీ

అనంతపురంలో జనసేన కరపాత్రల పంపిణీ

Saturday, 17th Nov 2018

ప్రస్తుతం గోదావరి జిల్లాలో యాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తున్న పవన్ త్వరలోనే సీమ యాత్రను కూడా చేపట్టబోతున్నారు. అయితే ఈలోపే అక్కడి జనసైనికులు పవన్ ప్రకటించిన ప్రీ మేనిఫెస్టోని ప్రజల దృష్టికి తీసుకెళ్లే పనిలో ఉన్నారు.

ఇందుకోసం వారు అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిని వేదికగా చేసుకుని పవన్ ఇదివరకే ప్రకటించిన 12 సూత్రాలను కరపత్రాల ద్వారా ప్రజలలోకి తీసుకువెళుతున్నారు. ఈ జనబాట కార్యక్రమాన్ని ఎన్.ఆర్.ఐ నాగేందర్ మరియు బొంగరం శీను నేతృత్వంలో చేస్తుండగా అధిక సంఖ్యలో ప్రజలు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈక్రమంలోనే పవన్ సీమ యాత్ర చేపట్టేలోపు కరపత్రాల ద్వారా జనసేనపై ప్రజలలో చైతన్యం వస్తుందని జనసైనికులందరూ భావిస్తున్నారు.

Latest article

పవన్ అంటే టీడీపీకి ఎందుకంత భయం ?

పవన్ అంటే టీడీపీకి ఎందుకంత భయం ?

Saturday, 17th Nov 2018

సమృద్ధిగా పండ్లను ఇచ్చే చెట్టుకే రాళ్ల దెబ్బలు ఎక్కువ అనే సామెత తెలుగు ప్రజలకు చిరపరిచితమే. సమాజంలోని ఆకలిని రూపుమాపడానికి స్వార్ధం ఎరుగని చెట్టు తనవంతు సహాయం చేస్తుంటే ఇంకా కావాలనే మనిషిలోని ఆశ దానిని రాళ్ల దెబ్బలకు గురిచేస్తోంది. రాజకీయంలో నీతి, నిబద్దత కలిగిన నాయకులు ఇటువంటి చెట్లతో సమానమే. వారు భావితరానికి అందించే ఫలాలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తాయి. అయితే దుర్మార్గ రీతిలో సంపాదించడం మొదలుపెట్టిన స్వార్ధ రాజకీయ నాయకులు అటువంటి నిస్వార్ధ నాయకులపై రాళ్లు రువ్వడం నేడు అత్యంత సహజమైపోయింది. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై టీడీపీ నాయకులు అనుసరిస్తున్న విధానం ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది.

అప్పట్లో నందమూరి తారకరామారావు స్థాపించిన టీడీపీ మహావృక్షమై ఎంతమందికో ఆదర్శప్రాయంగా నిలువగా, ప్రస్తుతం చంద్రబాబు అధ్యక్షతన ఎందరో స్వార్ధపరులకు నీడనిస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే దీనిని పవన్ గ్రహించగా, వెంటనే తన మద్దతును ఉపసంహరించుకుని టీడీపీ అధికారుల అవినీతిని బట్టబయలు చేస్తూ వస్తున్నారు. ఒకప్పుడు పవన్ నీతి, నిబద్దతతో కూడిన నాయకుడని పొగిడిన స్వార్ధపూరిత టీడీపీ నాయకులే ఇప్పుడు ఆయన ఎదురుతిరిగే సరికి తీవ్రంగా విమర్శించడం మొదలుపెట్టారు. తన అసంఖ్యాక అభిమాన గణంతో గత ఎన్నికలలో విజయాన్ని అందించిన పవన్ ఇలా ఎదురుతిరిగే సరికి టీడీపీ నాయకులకు వచ్చే ఎన్నికల విజయంపై నమ్మకం సన్నగిల్లిందని చెప్పవచ్చు.

ఇకపోతే టీడీపీ నాయకులను కలవరపెట్టే మరో అంశం పవన్ కులం. తాను ఏ కులానికీ చెందినవాడిని కానని పవన్ వెల్లడించినా, కులాలను ఏకం చేయడమే తన లక్ష్యమని ఉద్ఘాటించినా రాష్ట్రంలోని ఒక వర్గం ప్రజలు ఆయన పక్షానే నిలుస్తారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇందుకు కారణం కూడా గత తరం నాయకులే అని చెప్పవచ్చు. రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న వారి కులానికి సీట్ల కేటాయింపుతో మొదలుకుని అనేక విషయాలలో తరతరాలుగా అన్యాయం జరుగుతూ వస్తోందని ఆ వర్గ ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ టీడీపీ నుండి మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆ వర్గం ఓట్లు తమకు ప్రతికూలంగా మారతాయని టీడీపీ కలవరపడుతోంది.

2009 ఎన్నికలలో టీడీపీ ఓటమికి ప్రధాన కారణం కూడా ఇదే అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సంవత్సరాల తరబడి ఏలిన అవినీతి నాయకులను చూసి విసిగిపోయిన సామాన్య జనం నిజాయితీ గల నాయకుడి కోసం ఎదురుచూస్తున్న ప్రస్తుత తరుణంలో నిస్సందేహంగా పవన్ ఒక ఆశాకిరణమనే చెప్పొచ్చు. అందుకే ఆయనలో ఏ గుణాన్ని కూడా వంకబెట్టలేని టీడీపీ నాయకులు పచ్చ మీడియాను అడ్డుపెట్టుకుని వ్యక్తిగత విషయాలతో దాడికి సిద్దపడుతున్నారు. మరి ఆకలి తీరే వరకు పవన్ నీడన ఉన్న వీరు, అవసరం తీరగానే రాళ్లు రువ్వడాన్ని ప్రజలు ఎంతవరకు భరిస్తారనేది వచ్చే ఎన్నికలతో కాని తేలదు.

Latest Videos

latest post

కంఠం కోసుకుంటా కాని ఆ పని చేయను : పవన్ కళ్యాణ్

కంఠం కోసుకుంటా కాని ఆ పని చేయను : పవన్ కళ్యాణ్

Saturday, 10th Nov 2018

నోట్ల రద్దుపై చంద్రబాబును ప్రశ్నించిన పవన్

నోట్ల రద్దుపై చంద్రబాబును ప్రశ్నించిన పవన్

Friday, 9th Nov 2018

బ్రోకర్ అనే పదానికి వర్మ సరిగ్గా సరిపోతాడు : కళ్యాణ్ దిలీప్

బ్రోకర్ అనే పదానికి వర్మ సరిగ్గా సరిపోతాడు : కళ్యాణ్ దిలీప్

Friday, 9th Nov 2018

ఎం ఎల్ ఎ వర్మను ప్రజలే తిరిగి పంపిస్తారు : కందుల దుర్గేష్

ఎం ఎల్ ఎ వర్మను ప్రజలే తిరిగి పంపిస్తారు : కందుల దుర్గేష్

Friday, 9th Nov 2018